Stock Market: మూడోరోజూ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు..! 7 h ago
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా మూడోరోజూ నష్టాల్లో ముగిశాయి. ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు. రోజంతా ఒడుదొడుకులు ఎదుర్కొన్నాయి. ఇంట్రాడేలో 77,919.70 వద్ద గరిష్ఠాన్ని తాకిన సూచీ మధ్యాహ్నం తర్వాత పూర్తిగా నష్టాల్లోకి జారుకుంది. చివరికి 241.30 పాయింట్ల నష్టంతో 77,378.91 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 95 పాయింట్ల నష్టంతో 23,431 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 10 పైసలు క్షీణించి 85.96గా వుంది.